Posts

Showing posts from July, 2026

శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం

శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పం అర్ధముతో కూడిన పూజా విధానం శ్రీ వరలక్ష్మీ వ్రత౦ ప్రారంభం:   ముందుగా పూర్వాంగం మరియు పసుపు గణపతి పూజ చేయవలను పూర్వాంగం   శ్రీమహాగణాధిపతయే నమః |  శ్రీ గురుభ్యో నమః |  హరిః ఓమ్ | శుచిః — అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః || పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః || తాత్పర్యం/అర్థం శ్రీమహాధిపతయే నమః: విఘ్నాలను తొలగించే మరియు గణములకు అధిపతి అయిన ఆ మహాగణపతికి (వినాయకుడికి) నా నమస్కారములు. మొదటగ, ఏ పనైనా నిర్విఘ్నంగా (ఎలాంటి ఆటంకాలు లేకుండా) సాగాలని మొదటగా వినాయకుడిని ప్రార్థించడం మన సనాతన సంప్రదాయం. శ్రీ గురుభ్యో నమః: నన్ను నడిపించే గురువులకు, గురు పరంపరకు నా నమస్కారములు. తరువాత, మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, అజ్ఞానమనే చీకటి నుండి వెలుగు వైపు నడిపించే గురువులను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.  హరిః ఓమ్: సకల పాపాలను హరించే ఆ పరమాత్మునికి (హరికి), సృష్టికి మూలమైన ప్రణవ నాదానికి (ఓంకారానికి) వందనం.  ఇది శుభప్రదమైన మంగళ వచనం. మనస్సును ప్రశాంత పరచడానికి, దైవచింతనతో కూడిన సత్కార్...